రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం
– ఉదయం నుంచి ప్రత్యేక హోమం
– పాల్గొనేందుకు భక్తులకు అవకాశం
– అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ సమీపంలోని కోకట్ రోడ్డుమార్గంలో వెలసిన శ్రీషిర్డిసాయిబాబా దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో వెలసిన సాయినాథునికి సోమవారం తెల్లవారు జామున మేలుకొలుపు, హారతి, ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు హోమం, ఉదయం 7గంటల నుంచి 10 గంటల వరకు మూల విరాట్టుకు భక్తులచే పాలాభిషేకం, 12 గంటలకు మహా నైవేద్యం, మధ్యాహ్న హారతి, దూపహారతి, పల్లకి సేవ, పవళింపు హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడ ఉంటుందని వివరించారు. హోమంలో పాల్గొనదలచిన వారు రూ.2100లు చెల్లించాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సాయి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు..!