భద్రేశ్వరునికి 108 పంచముఖి రుద్రాక్షమాల
– రూ. 25వేల విలువైన మాల వితరణ
– గజమాల సర్పంచి భక్తిని చాటుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు నడిచొచ్చిన దైవం భావిగి భద్రేశ్వరునికి భక్తులు వివిధ రకాల కానుకలను సమర్పించుకుంటున్నారు. రెండేళ్ల తరువాత నిర్వహిస్తున్న భద్రేశ్వర జాతర ఉత్సవాలలో తరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. శనివారం జాతర ఉత్సవాలలో భాగంగా పట్టణానికి చెందిన కాపు రమేష్, సవిత రష్మి కుటుంబ సభ్యులు స్వామివారికి 108 పంచ రుద్రాక్షలతో వెండి తొడుగులతో రూపొందించిన రుద్రాక్షమాలను స్వామి వారికి సమర్పించారు. దీని ఖరీదు దాదాపు 25 వేలు ఉంటుందని తెలిపారు. ఆలయన రెనోవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్, సమాజం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరించారు.
మరోవైపు తాండూరు పట్టణానికి చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు స్వామి వారికి గజమాలను సమర్పించారు. దశాబ్దాలుగా వారు ఈ అనవాయితీని కొనసాగిస్తున్నారు. వీరితో పాటు పలువరు కూడ వారి వారి ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామివారిపై భక్తిని చాటుకుంటున్నారు.

