ప‌దోన్న‌తికి వ‌న్నె తెచ్చే సేవ‌లందించాలి

కెరీర్ తాండూరు వికారాబాద్

ప‌దోన్న‌తికి వ‌న్నె తెచ్చే సేవ‌లందించాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్
– జిల్లాలో 25 మంది కానిస్టేబుళ్ల‌కు ప్ర‌మోష‌న్
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌దోన్న‌తి పొందిన ప‌ద‌వితో మెరుగైన సేవ‌లందించి పోలీసుశాఖ‌కు వ‌న్నె తీసుక‌రావాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో పని చేస్తున్న 25 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందారు. ఈ సంద‌ర్భంగా వారు మంగ‌ళ‌వారం జిల్లా పోలీస్ కార్యలయంలో జిల్లా ఎస్‌పి ఎన్. కోటి రెడ్డి IPS మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ప‌దోన్న‌తి పొందిన కానిస్టేబుళ్ల‌కు కౌన్సిలింగ్ నిర్వహించి పోలీస్ స్టేషన్ లకు పోస్టింగ్ అలాట్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. అనంత‌రం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంతకర్ణశుద్దితో కష్టపడి పని చేయాల‌న్నారు. ప‌దోన్న‌తి సేవ‌ల‌తో పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకోరావాలని అన్నారు. ప్రజలకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం కలుగుతుంది అనే భరోసా కలిగే విధంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ ప‌ద‌వి నుంచి మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు.