ఓటింగ్ కౌంట్ డౌన్..!
– రేపు అసెంబ్లీ పోలింగ్
– ఈ సారి ప్రత్యేకతలు
– అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
– డీఆర్సీ నుంచి ఈవీఎంల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తాండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి. ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 23 మంది సెక్టోరల్ అధికారులు, 23 మంది రూట్ ఆఫీసర్లు. 269 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు అదనంగా 41 మంది అధికారులతో పాటు 269 మంది సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, వారికి అదనపు సహాయక అధికారులుగా 39 మందిని నియమించారు. అదేవిధంగా 54 మందితో సూక్ష్మ పరిశీలకుల బృందం. 173 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది. 18 ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 స్టాటిస్టిక్స్ బృందాలు, ఒక వీడియో సర్వేలైన్ బృందం. ఒక వీడియో మీ వింగ్ బృందం, మరోక అకౌంటింగ్ బృందం, 155 మందితో పోలింగ్ నోడల్ అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు.
ఈసారి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలివే
తాండూరులోని 269 పోలింగ్ కేంద్రాలలో ఒక మహిళ మోడల్ పోలింగ్ కేంద్రం. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 1 యూత్ మేనేజ్ డ్ పోలింగ్ కేంద్రం. 1 ప్రత్యేక అవసరాల గల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వృద్ధులు. వికలాంగుల కోసం 155 పోలింగ్ ప్రాంతాలలో 155 వాహనాలను ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదంయ నుంచి తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ లో ఏర్పాటు చేసిన డీఆర్సీ(డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్) నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు.
ఉదయం నుంచి 7నుంచి పోలింగ్
తాండూరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలో 209పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఉదయం. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఓబర్ల వద్ద ఓటరు కార్డు లేకున్నా ఓటు వేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. అయితే ఓటరు కార్డుకు బదులుగా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగుల గుర్తింపు, ఉద్యోగుల గుర్తింపు, ఫించన్ పుస్తకాలు తదితర వాటిలో ఏదో ఒక దానిని చూపించి ఓటు వేయొచ్చని అధికారులు తెలిపారు
ఇది కూడా చదవండి…

