ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే
– బీహార్ నుంచి రాజకీయ ప్రయాణం
– పార్టీ పేరు జన్ సురాజ్గా పెట్టేందుకు ఆలోచన
దర్శిని డెస్క్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. సొంత పార్టీ కూడా పెడుతున్నట్లు చెప్పారు. అయితే ప్రశాంత్ కిశోర్ స్థాపించబోయే పార్టీ పేరు జన్ సురాజ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ పేరుతోనే ఆయన పార్టీ స్థాపించనున్నట్లు తెలుస్తోంది. 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ప్రజల కోసం విధానాలను రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని పేర్కొన్నారు. తన కొత్త ప్రయాణాన్ని బిహార్ నుంచి ప్రారంభిస్తున్నట్లు పీకే ప్రకటించారు. ప్రజా సమస్యలను మరింత అర్థం చేసుకోవాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని కూడా తెలిపారు.

