ఎంసీహెచ్‌లో వ‌స‌తుల క‌ల్ప‌న‌కు స‌హ‌కారం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఎంసీహెచ్‌లో వ‌స‌తుల క‌ల్ప‌న‌కు స‌హ‌కారం
– ఐవీఎఫ్ ద్వారా ఆసుప‌త్రికి ఐర‌న్ కుర్చీల విత‌ర‌ణ
– అంద‌జేసిన జిల్లా అధ్య‌క్షులు రొంప‌ల్లి సంతోష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుప‌త్రిలో వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌మ‌వంతు స‌హాకారం అందిస్తామ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్(ఐవీఎఫ్) వికారాబాద్ జిల్లా అధ్య‌క్షులు రొంప‌ల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేష‌న్ చైర్మ‌న్, ఐవీఎఫ్ అధ్య‌క్షులు ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జిల్లా అధ్య‌క్షులు రొంప‌ల్లి సంతోష్ కుమార్ త‌న తండ్రి స్వ‌ర్గీయ రొంప‌ల్లి కిష్ట‌య్య స్మార‌కార్థం ఎంసీహెచ్ ఆసుప‌త్రికి ఐర‌న్ కుర్చీల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐవీఎఫ్ చైర్మ‌న్ శ్రీ‌నివాస్ గుప్త ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నార‌ని అన్నారు. ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జిల్లా ఆసుప‌త్రిలో కుర్చీల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. అంతేకాకుండా ఆసుప‌త్రిలో మ‌రిన్ని స‌దుపాయాలు, సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు స‌హాకారం అందిస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఆసుప‌త్రిలో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ ర‌విశంకర్, క‌మిటి మెంబ‌ర్ డాక్ట‌ర్ ర‌మ‌ణ‌బాబు, ఐవీఎఫ్ తాండూరు అధ్య‌క్షులు గుముడాల గౌరీశంక‌ర్, స‌భ్యులు సతీష్‌, పార్శి వెంక‌ట్ దాస్, వాసవిక్ల‌బ్ అధ్య‌క్షులు క‌ల్వ వంశి త‌దిత‌రులు పాల్గొన్నారు.