తాండూరు డీఏఓ మహేష్ గౌడ్ బదిలీ
– ముగ్గురు ఉప తహసీల్దార్లకు స్థాన చలనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డివిజినల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డీఏఓ) మహేష్ గౌడ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్డీఓ కార్యాయలంలో పనిచేస్తున్న మహేష్ గౌడ్‌ను సూపరిండెంట్ కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయనతో పాటు జిల్లాలోని మరో ముగ్గురు ఉప తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. పెద్దేముల్ మండల ఉప తహసీల్దార్ కిరణ్ కుమార్‌ను వికారాబాద్ డీసీఎస్ఓ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కలెక్టరేట్లోని మహేష్ ను ఉప తహసీల్దార్‌గా నియమించారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ ఉప తహసీల్దార్ వి.విజయ్ను కలెక్టర్‌కు బదిలీ చేయగా తాండూరు ఉప తహసీల్దార్ శ్రీనివాసులును వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.

