చిన్నారుల ఆరోగ్యాల‌పై శ్ర‌ద్ద వ‌హించాలి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

చిన్నారుల ఆరోగ్యాల‌పై శ్ర‌ద్ద వ‌హించాలి
వార్డుల్లో నులి పురుగుల నివార‌ణ మాత్ర‌ల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: చిన్నారుల ఆరోగ్యాల‌పై త‌ల్లిదండ్రులు శ్ర‌ద్ద వ‌హించాల‌ని తాండూరుకు చెందిన కౌన్సిల‌ర్లు, నాయ‌కులు అన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలోని వివిధ వార్డుల్లో నులి పురుగుల నివార‌ణ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.
,
21 వ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ స‌ల్మా పాతిమా జుబేర్‌లాల‌
,
30 వ వార్డులో కౌన్సిల‌ర్ మెహ‌రాజ్ భేగం అఫ్పూ

20 వ వార్డులో బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్‌లు చిన్నారుల‌కు అల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను వేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు నులిపురుగుల బారిన ప‌డ‌కుండా మాత్ర‌ల‌ను వేయించాల‌న్నారు. 19 ఏండ్ల‌లోపు చిన్నారుల‌కు నులిపురుగుల మాత్ర‌ల‌ను వేయించాల‌ని సూచించారు. ముందే సీజ‌న‌ల్ వ్యాధుల‌ను దృష్టిలో ఉంచుకుని చిన్నారుల ఆరోగ్యాల‌పై శ్ర‌ద్ద వ‌హించాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, ఆశ కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.