అందరు స్వచ్చతను పాటించాలి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

అందరు స్వచ్చతను పాటించాలి
– రాజీవ్ కాలనీలో చెత్త డబ్బాల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అందరు స్వచ్ఛతను పాటించాలని తాండూరు పట్టణం రాజీవ్ గృహకల్ప కాలనీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్ అన్నారు. ఆదివారం కాలనీలో ఇంటింటికి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో తడిచెత్తను, పొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంటేనే అంద‌రు ఆరోగ్యంగా ఉంటార‌న్నారు. కావున అంద‌రు ప‌రిశుభ్ర‌త‌ పాటించాలని, స్వచ్ఛతకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సాయప్ప, జవాన్ సీహెచ్ అశోక్, వెంకట్ రెడ్డి, వాజీద్, బాబా సాహెబ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.