రేపే అర్బన్ ఆసుపత్రి ప్రారంభం
– ప్రారంభించనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో నిర్మించిన అర్బన్ ఆసుపత్రి ప్రారంభానికి ముస్తాబయ్యింది. రేపు మంగళవారం ఉదయం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్, పీహెచ్సీ ఆసుపత్రిలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో కూడ అర్బన్ ఆసుపత్రిని మంజూరు చేసింది. పట్టణంలోని ఇందిరానగర్‌లో మున్సిపల్‌కు చెందిన కమ్యూనిటీ హాల్లో అర్బన్ ఆసుపత్రిని నిర్మించారు. రూ. 8 లక్షలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. గత రెండు నెలల క్రితమే ఆసుపత్రి నిర్మాణానికి ముస్తాబయ్యింది. రేపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అర్బన్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. దీంతో ఇందిరానగర్‌లోని అర్బన్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

