రైతుల ఇంట సిరుల కాంతులు పండాలి
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శని ప్రతినిధి: ఆరుగాలం కష్టపడే రైతన్నల ఇంటా సిరుల కాంతులు పండాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆయన తాండూరు నియోజకవర్గంలోని రైతులందరికి పండగ శుభాకాంక్షలను తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగను రైతులందరు తమ కుటుంభీకులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ సారి నియోజకవర్గంలో రైతుల ఇంట పాడి పంటలతో సిరుల కాంతులు నిండిపోవాలని అభిలాషించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిల సహాకారంతో రైతుల అభ్యున్నతికి తోడ్పాటు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
