తాండూరులో వ్యక్తి దారుణ హత్య
– కొబ్బరిబొండాం కత్తులు, గొడ్డళ్లతో దాడి
– కలకలం రేపిన ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. పట్టణంలోని మల్ రెడ్డిపల్లికి చెందిన లాలప్ప(46) సాయంత్రం ఇంటి వద్ద ఉండగా ఓ ఇద్దరు వ్యక్తులు కొబ్బరి బొండాలు నరికే కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దీంతో లాలప్ప తలపై, మెడపై, చాతిపై లోతైన గాయాలతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అక్కడికక్కడే లాలప్ప మృతి చెందాడు. అయితే లాలప్ప హత్య వెనుక కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. హత్యకు పాల్పడిన నిందితులు స్థానిక పోలీస్టేషన్లో లొంగిపోయనట్లు సమాచారం. ఇదిలా ఉండగా లాలప్ప హత్యకు అక్రమ సంబంధమే కారణమని పుకార్లు వినిపిస్తున్నాయి.

