రేపు తాండూరు మండలంలో పల్లెపల్లెకు ఎమ్మెల్సీ
– పాల్గొననున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరు మండలంలో పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమం చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. శనివారం ఉదయం మండలంలోని చెంగొల్, చింతామణి పట్నం, పర్వతాపూర్, అల్లాపూర్, జిన్గుర్తి గ్రామాలలో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆయా గ్రామాలలో జరిగే పర్యటనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రజలతో సమ్మేళనమై ప్రజా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాలలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

