ప్రజాసంగ్రామ ముగింపు సభకు తరలిన కమలనాధులు

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజాసంగ్రామ ముగింపు సభకు తరలిన కమలనాధులు
– 3వేల మందిని తీసుకెళ్లిన యు.రమేష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర‌ ముగింపు సభకు తాండూరు నుంచి కమల నాథులు భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్ లోని తుక్కుకూడలో నిర్వహిస్తున్న సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్న సందర్భంగా బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించారు. తాండూరు నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున 3 వేల మంది కార్యకర్తలను తరలించారు. ఈ సందర్భంగా యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రను ప్రజలు మా నాయకునికి భ్రహ్మ రథం పట్టరాని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అనే భావనతో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయని. వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను అధికారంలోకి తీసువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంగెం హన్మంతు, బంభారం భద్రేశ్వర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, బాలప్ప, నాయకులు పూజారి పాండు, యాలాల ఇంచార్జ్ రజనీకాంత్, పెద్దేముల్ అధ్యక్షులు సందీప్, బషీరాబాద్ అధ్యక్షులు గంగాదర్, యాలాల అధ్యక్షులు మహిపాల్, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.