డాన్స్‌లతో మాన‌సిక ఉల్లాసం

కెరీర్ తాండూరు వికారాబాద్

డాన్స్‌లతో మాన‌సిక ఉల్లాసం
– నృత్య క‌ళ‌ల‌ను ఆద‌రించాలి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : డాన్స్‌లు మాన‌సిక ఉల్లాసానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని వ‌రుణ్ డాన్స్ స్టూడియో డాన్స్ మాస్ట‌ర్ గోపాల్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న జిల్లా స్థాయి డాన్స్ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డాన్స్ పోటీల‌కు సంబంధించి గోడ ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌పంచంలో డాన్స్ విభిన్న‌మైంద‌న్నారు. డాన్స్‌ల‌తో మాన‌సిక ఉల్లాసాన్ని క‌ల‌గిస్తాయ‌న్నారు. నృత్య క‌ళ‌ల‌ను అంద‌రు ఆద‌రించాల‌న్నారు. మ‌రోవైపు డ్యాన్స్ మాస్ట‌ర్ గోపాల్ మాట్లాడుతూ జిల్లా స్థాయి డాన్స్ పోటీల‌ను తాండూరులో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), సీనీయ‌ర్ నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, రాజుగౌడ్, యాలాల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, కోఆప్ష‌న్ స‌భ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అక్బర్ బాబ, డాన్స్ మాస్టర్లు అశోక్, రమేష్, అశోక్(అశు) తదితరులు పాల్గొన్నారు.