పీహెచ్‌సీల‌ బ‌లోపేతం

ఆరోగ్యం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

పీహెచ్‌సీల‌ బ‌లోపేతం
– ఆరోగ్య కేంద్రాల‌లో ఆరోగ్య శ్రీ సేవ‌లు
– సాధార‌ణ ప్ర‌స‌వాల‌కు ప్రోత్స‌హాం
– త్వరలో 750 వైద్య పోస్టుల భర్తీ
– వైద్య ఆరోగ్య‌శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)ల బ‌లోపేతంపై స‌ర్కారు ప్ర‌త్యేక దృష్టిసారిస్తోంద‌ని రాష్ట్ర ప్ర‌జా వైద్య ఆరోగ్య‌శాఖ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ కేంద్రంలోని స‌ర్కారు ద‌వ‌ఖాన‌, చాతి ఆసుప‌త్రి, ప‌లు ఆరోగ్య కేంద్రాల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు.
అనంతరం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పీహెచ్ సీలలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ఆయా కేంద్రాల‌లోని వైద్యులకు శిక్షణ ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి పీహెచ్‌సీలో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని అన్నారు. సర్కారు దవాఖానలో సాధారణ ప్రసవం చేస్తే రూ.3,000 ప్రోత్స‌హాకం అందజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో 750 పోస్టుల‌ను త్వ‌ర‌లోనే బ‌ర్తి చేస్తామ‌న్నారు. ఇదేకాకుండా వ‌చ్చే యేడాదిన్న‌ర కాలంలో రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల‌లో మెడిక‌ల్ క‌ళాశాల‌, టీచింగ్ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సీనేష‌న్ వ‌ల్ల మ‌హ‌మ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నామ‌ని గుర్తుచేశారు. బూస్ట‌ర్ డోసుతో పాటు చిన్నారుల‌కు వ్యాక్సీనేష‌న్ పూర్తి చేసేందుకు దృష్టిసారిస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం జిల్లా వైద్యాధికారి తుకారాం భట్‌, అధికారులు పాల్గొన్నారు.

కింది వ‌ర‌కు చూడండి…