ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి
– కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్
– 25వ వార్డులో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కాంగ్రెస్ పార్టీ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని త‌న వార్డు 25లో తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో ఆయ‌న పాల్గొన్నారు. మున్సిప‌ల్ అధికారులు, ఆర్పీల‌తో క‌లిసి కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించారు. వార్డు మ‌హిళ‌లు, ప్ర‌జ‌ల‌తో క‌లిసి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ గౌడ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిని తూతూ మంత్రంగా కాకుండా ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌న్నారు. వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువ‌లు, వీధి దీపాలు వంటి మౌళిక స‌దుపాయాల‌లో ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. వార్డుల్లో అభివృద్ధితో పాటు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వీఆర్ఓ, ఆర్పీ, అంగ‌న్ వాడి టీచ‌ర్లు, ప్రజలు పాల్గొన్నారు.