క‌ష్ట‌ప‌డి ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవాలి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

క‌ష్ట‌ప‌డి ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవాలి
– తాండూరు త‌హ‌సీల్దార్ చిన్న‌ప్ప‌ల నాయుడు
– ప్ర‌గ‌తి కోచింగ్ ఆధ్వ‌ర్యంలో ఉత్స‌హాంగా క్రీడా దినోత్స‌వం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: యువ‌త ఇష్ట‌ప‌డి ఎంచుకున్న ల‌క్ష్యాల‌ను క‌ష్ట‌ప‌డి నెర‌వేర్చుకోవాల‌ని తాండూరు త‌హ‌సీల్దార్ చిన్న‌ప్ప‌ల నాయుడు అన్నారు. ఆదివారం హాకీ క్రీడాకారుడు మేజ‌ర్ ధ్యాన్‌చంద్ 116 జ‌యంతి సంద‌ర్భంగా తాండూరు ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో జాతీయ క్రీడా దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి తాండూరు త‌హ‌సీల్దార్ చిన్పప్ప‌ల నాయుడు పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, శ్రీ‌నివాస్‌రెడ్డి, ప‌ట్టణ ఎస్ఐలు గిరి, అరవింద్ కుమార్‌ల‌తో క‌లిసి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు సంయుక్తంగా మార‌థాన్ పోటీని జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం
పీఈటీ రాము ఆధ్వ‌ర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల‌కు, జాతీయ‌, రాష్ట్ర స్థాయి క్రీడాకారుల‌కు స‌న్మానం నిర్వ‌హించారు. దీంతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగుల‌కు శిక్ష‌ణ పొందుతున్న అభ్య‌ర్థుల‌కు వివిధ పోటీలు నిర్వ‌హించి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌సీల్దార్ చిన్న‌ప్ప‌ల నాయుడుతో పాటు ప‌లువురు మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఉద్యోగ‌వ‌కాశాల‌ను క‌ల్పించ‌బోతుంద‌న్నారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌ప‌డుతున్న అభ్య‌ర్థులు క‌ష్ట‌ప‌డి ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌గ‌తి కోచింగ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్లు శ్రీశైలం యాదవ్, సంగమేశ్వర్, ఫిజికల్ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, గౌరీ శంకర్, కృష్ణయ్య, రాధ కృష్ణ, పాఠశాల డీఎస్, సీనియర్ పాత్రికేయులు శెట్టి రవి, నాయకులు శ్రీనివాస్ చారి, బాబా గౌడ్, విద్యార్థిని విద్యార్థులు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.