సాయికృప అందరికి సిద్దించాలి
– వైశ్య ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్
– గురుపౌర్ణమిలో ప్రత్యేక పూజలు
తాండూరు,దర్శిని ప్రతినిధి : భక్తులు, ప్రజలపై శ్రీ సాయినాథుని కృప సిద్దించాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్ ప్రార్థించారు. బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని శ్రీ షిర్డి సాయి మందిరంలో వేడుకలకు హాజరయ్యారు. ఆలయంలో వెలసిన శ్రీ సాయి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజల కోసం సాయినాథునికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు క్షేమంగా.. ఉండాలని, వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారు సురక్షితంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. ఆ సాథుని కృప భక్తులతో పాటు ప్రజలందరికి దక్కాలని ఆకాంక్షించారు.



