సునీతమ్మ వెన్నంటే ఉంటాం

తాండూరు రాజకీయం వికారాబాద్

సునీతమ్మ వెన్నంటే ఉంటాం
– ఇంటికి వెళ్లి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు
– తాండూరు, యాలాల, బషీరాబాద్ నాయకుల భరోసా
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఎన్ని కుట్ర‌లు జ‌రిగినా.. కుతంత్రాలు చేసిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మ హేందర్ రెడ్డి వెన్నంటే ఉంటామ‌ని తాండూరు నియోజకవ‌ర్గ నేత‌లు భ‌రోసా క‌ల్పించారు. ఇటీవల మర్పల్లి మండలంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వర్గీయుల దాడి ఘటనను ఖండించారు.
శనివారం హైదరాబాద్‌లో సునితామహేందర్ రెడ్డిని తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ఎంపీటీసీలు, స‌ర్పంచులు, ప్రజా ప్రతినిధులు కలిసి మద్దతు తెలిపారు. యాలాల మండలం నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, యాలాల మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, తాండూరు మండలం నుంచి తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, సర్పంచ్ మెఘనాథ్ గౌడ్,

బషీరాబాద్ మండలం నుంచి జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మ‌న్ వెంక‌ట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిలతో భేటి అయి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, అశోక్, అంబ్రేష్, అభిమానులు తదితరులు ఉన్నారు.