సీఎం సహాయ నిధి పేదలకు వరం
– ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
యాలాల, దర్శిని ప్రతినిధి: సీఎం సహాయ నిధి పేదలకు వరంలాంటిదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. యాలాల మండలం ముద్దాయిపేట్ గ్రామానికి చెందిన అంజిలయ్య తల్లి దేవమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె చికిత్స కోసం ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఆశ్రయించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే రూ.1 లక్షా విలువైన ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంజూరైన ఎల్ఓసీని లబ్దిదారు కుటుంబసభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం వరంగా మారిందన్నారు. లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



