కేసిఆర్ అవినీతికి బీజేపీ చెక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేసిఆర్ అవినీతికి బీజేపీ చెక్..!
– దోపిడి చిట్టాలను సేకరిస్తున్న కేంద్రం
– గ్రామస్థాయిలో పార్టీ భరోసా బైక్ ర్యాలీలు
– మాజీ మంత్రి, బీజేపీ నాయకులు ఏసీఆర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అవినీతికి చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోందని బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం తాండూరులోని దుర్గా గ్రాండ్యూర్లో ఏర్పాటు చేసిన పార్టీ పదాధికారులు సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం పాలన కంటే అధ్వాన్నంగా పాలిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన 8.ఏండ్లలో అవినీతి, దోపిడి పెరిగిందన్నారు. ఓ వ్యక్తికి అన్యాయం చేయకుండా పోలీసుశాఖ పనిచేస్తుందని చెప్పుకొచ్చిన కేసీఆర్ పాలనలో పోలీసులు సామాన్యులపై రెచ్చిపోతున్నారని అన్నారు. మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతూ రక్ష‌కులే భక్తులుగా తయారయ్యాన్నారు. ఎన్నికల మెన్నికల మేనిఫెస్టోకు వ్యతిరే కంగా నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలను క్పలించకుండా అందినకాడికి దోచుకుంటూ దోపిడి రాజ్యంగా మార్చారని విమర్శించారు. విద్యా, వ్యాపారం, ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ సాగిన అవినీతిని కేంద్రం సేకరిస్తుందన్నారు. త్వరలోనే టీఆర్ఎస్, కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు ప్రధాని మోడితో పాటు పార్టీలో ఉన్న మేధావులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.

21 నుంచి బీజేపీ బైక్ ర్యాలీలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21నుంచి బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ఎన్నికల మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రామాల ప్రజలకు వివరించడమే ప్రధాన ధ్యేయమన్నారు. దీంతో పాటు కేంద్రం గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి 75 శాతం నిధులు విడుదల చేస్తే దానిని వాటిని దారి మ‌ళ్లించి కేసీఆర్ ప్రభుత్వం తమ అభివృద్ధిగా ప్రకటించుకున్న కుట్రలను వివరించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలమైన శక్తిగా మార్చేందుకు చేపడుతున్న బైక్ ర్యాలీలలో అందరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అంతకుముందు పదాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధులుగా హాజరైన సికింద్రాబాద్ ఇంచార్జ్ నాగురావు నామోజి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏసీఆర్‌లు కార్య‌క్ర‌మంపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, ప్రధాన కార్యదర్శులు యు.రమేష్ కుమార్, పాండుగౌడ్, వెంకటయ్య గౌడ్, వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహాల్లాద్ రావు, నాగారం నర్సింలు, ఓబీసీ మార్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల శాంతుకుమార్, ఉపాధ్యక్షులు శివకుమార్, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనీయ‌ర్ నాయకులు బాలి శివకుమార్, బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్లు లావణ్య, బాలప్ప, నాయ‌కులు చంద్ర శేఖర్, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు సందీప్‌, కార్య‌క‌ర్త‌లు తదితరులు పాల్గొన్నారు.