విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు
– నాణ్యమైన భోజనం అందించాలి
– యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు
– టీఎస్ఆర్ఎస్(జీ)ని సందర్శించిన నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని, విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నాయకులు అన్నారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మోయిన్ అహ్మద్, ఎస్ఎూబ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ కెట్టిలు తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ రాష్ట్ర బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను(టీఎస్ఆర్ఎస్-జీ) సందర్శించారు. ప్రిన్సిపల్ రజితను కలిసి పాఠశాలల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ? ఎలాంటి భోజనం అందిస్తున్నారు ? ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు ? అనే విషయాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలన్నారు. విద్యతో పాటు బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని, క్రమం తప్పకుండా మెను పాటించాలని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంపై పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సయ్యద్ మకూర్, ఎస్ఎస్‌యూఐ నాయకులు మణికంఠ ఉన్నారు.