ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు న్యాయం చేస్తాం

కెరీర్ తాండూరు వికారాబాద్

ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు న్యాయం చేస్తాం
– అర్హులైనవారంద‌రికి అక్రిటేషన్ కార్డులు
– పిల్ల‌ల చ‌దువు ఫీజుల్లో 50 శాతం రాయితి
– ఇండ్లు లేని వారికి స్థలం ఏర్పాటుకు కృషి
– త్వరలోనే సోషల్ మీడియా ప్రక్షాళన
– టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు న్యాయం జ‌రిగేవిధంగా టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ యూనియ‌న్ త‌రుపున కృషి చేస్తామ‌ని యూనియ‌న్ వికారాబాద్ జిల్లా అధ్య‌క్షులు శ్రీ‌నివాస్ చారి పేర్కొన్నారు. ఆర్హులైన వారందరికీ ఆక్రిటేషన్ కార్డులు అందించేందుకు వంద‌శాతం ప‌నిచేస్తామ‌ని అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ వారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్రిటి షన్ కార్డులు రాలేని అర్హులైన‌ జర్నలిస్టులకు రెండో విడతలో కార్డులు అంటే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లల ఫీజుల చెల్లింపులో 50 శాతం రాయితీ వర్తించేలా గతంలోనే విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డిని కోరడం జరిగిందని, అందులో భాగంగా తాండూరులోని జర్నలిస్టుల పిల్లల చదువు ఫీజులలో రాయితీ వర్తించేలా దృష్టిసారిస్తున్నామన్నారు. అదేవిధంగా తాండూరులో ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా యూనియన్ తరుపున కృషి చే స్తామని, ఇందుకోసం యూనియన్ సభ్యులు ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాత్రికేయ విలువలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగ‌తుల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. దీంతో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ చానలల ప్రక్షాళనపై దృష్టిసారిస్తామని, జర్నలిస్టులకు దాడుల నుంచి భద్రత కల్పించే విధంగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.

జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డులు
————————————————

సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ తరపున పనిచేస్తున్న విలేకరులకు సొంత ఖర్చులతో గుర్తింపు కార్డులు అందజేసేవిధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా స్కూళ్లు, కాలేజీలలో జర్నలిస్టుల పిల్లల చదువులకు తనవంతుగా తోడ్పాటు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. యూనియ‌న్ త‌రుపున ప‌లు విధాలుగా చేయూత‌నందిస్తామ‌ని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ క్రమశిక్షణ సంఘం సభ్యులు వెంకటేశం(వాసు), నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నర్సింలు, మాజీ కార్యదర్శి నరేందర్(లిట్టు), తాండూరు పట్టణ అధ్యక్షులు నిరంజన్ స్వామి, కార్యదర్శి మ‌హేష్, తాండూరు మండల అధ్యక్షులు సంగమేశ్వర్, కార్యదర్శి వెంకటేష్, శాంతు, బ‌షీరాబాద్ మండల అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి సైమండ్స్, సభ్యులు రాంరెడ్డి, యాలాల మండల సభ్యులు రాములు, రఘు రెడ్డి, పెద్దేముల్ మండల సభ్యులు గౌస్, గయాజ్, సీనియర్ జర్నలిస్టులు రాంచందర్, లక్ష్మారెడ్డి, కోస్గి నర్సింలు, బాబర్, రాందాస్, వివిధ మండలాలు జర్నలిస్టులు పాల్గొన్నారు.