తాండూరు@త్రివ‌ర్ణ శోభితం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు@త్రివ‌ర్ణ శోభితం..!
– పుర‌వీధుల్లో తిరంగా యాత్ర‌
– పాల్గొన్న ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు తివ్ర‌ర్ణ శోభితంగా మారిపోయింది. భారత దేశ 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృతోత్సవం, వజోత్సవ వేడుకల‌లో భాగంగా బుధ‌వారం తాండూరులో తిరంగా యాత్ర చేప‌ట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం నుంచి ఊరేగింపును ప్రారంభించారు.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘ‌వేంద‌ర్, సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్, ఆసిఫ్, నేతలు, కార్యకర్తలు హాజరై జాతీయ జెండా ఊరేగింపును ప్రారంభించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మీటర్ల జాతీయ జెండాను పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులతో చేప‌ట్టిన తిరంగా యాత్ర పుర‌వీధుల్లో త్రివ‌ర్ణ శోభితాన్ని త‌ల‌పించింది.

జాతీయ జెండా గొప్ప‌త‌నం, దేశ స్వాతంత్ర్యానికి అనుగుణంగా విద్యార్థులు, నేత‌లు చేసిన నినాదాలు మార్మోగాయి. జాతీయ జెండాతో పట్టణంలోని గాంధీ చౌక్, కూరగాయల మార్కెట్, ఇందిరా చౌర్సస్తా, అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. జాతీయ జెండా ప్రదర్శనతో నేతలు, విద్యార్థులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుదాకర్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు విఠల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, శ్రీ‌నివాస్ చారి, నరేందర్ గౌడ్, ఎస్సీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు నీర‌టి హ‌న్మంతు, చైతన్య కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఆర్ఫీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.