దేశ‌భ‌క్తిని మ‌ర‌వొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దేశ‌భ‌క్తిని మ‌ర‌వొద్దు..!
– మ‌ల్కాపూర్ స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండ‌రి
– గ్రామ పాఠ‌శాలలో వ‌జ్రోత్స‌వ వేడుక‌లు
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: విద్యార్థులు, పెద్ద‌లు, యువ‌కులు దేశ‌భ‌క్తిని మ‌రిచిపోవ‌ద్ద‌ని తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్ గ్రామ స‌ర్పంచ్ విజ‌లయ‌ల‌క్ష్మీ పండ‌రి అన్నారు. బుధ‌వారం వ‌జ్రోత్స‌వాల‌లో భాగంగా గ్రామంలోని పాఠ‌శాల‌లో వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. స్కూల్ ఆవర‌ణ‌లో జ‌రిగిన వేడుక‌ల‌కు స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండ‌రి హాజ‌ర‌య్యారు. వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా విద్యార్థులు 75 స్వాతంత్ర్య దినోత్స‌వ అంకెల‌తో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అనంత‌రం స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండ‌రి, ఉప స‌ర్పంచ్ అబ్దుల్ మాజిద్, కార్య‌ద‌ర్శి మోహ‌న్ నాయ‌క్ త‌దితరులు పాఠ‌శాల స‌మీపంలో మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్‌తో పాటు ప‌లువురు మాట్లాడుతూ సమ‌ర యోధుల త్యాగ ఫ‌లంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు దేశ‌భ‌క్తిని మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కూల్ చైర్మ‌న్ అల్లావుద్దీన్, వ‌డ్ల మ‌ల్లేశం, జినుగుర్తి బాబు, ప్ర‌ధానోపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ‌స్తులు పాల్గొన్నారు.