వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయానికి రిబ్బ‌న్ క‌ట్

తాండూరు రాజకీయం వికారాబాద్

వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయానికి రిబ్బ‌న్ క‌ట్
– ప్రారంభించిన సీఎం కేసీఆర్ 
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి సీఎం కేసీఆర్ రిబ్బ‌న్ క‌ట్ చేశారు. మంగ‌ళ‌వారం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వికారాబాద్‌కు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీసును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా అక్క‌డ టీఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్ క‌ట్ చేసి కార్యాల‌యంలోకి వెళ్లారు. పార్టీ ఆఫీసు లోప‌ల సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.