టీఆర్ఎస్ దాడులకు దడవం..!
– కార్యకర్తలంటే కేసీఆర్‌కు వణుకు
– అడ్డకున్న కార్యకర్తలపై దాడి హేయం
– వికారాబాద్ జిల్లాపై సీఎంకు చిత్తశుద్ది కరువు
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్ని దాడులకు పాల్పడినా బీజేపీ దడిసే ప్రసక్తే లేదని బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో యు. రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏకపక్ష, నియంతృత్వ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. తాండూరుకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించినా సీఎం కేసీఆర్ సభలో ఎలాంటి చర్చ చేయకపోవడం ఈ ప్రాంతంపై చిత్తశుద్ధి లేకపోవడమే అని విమర్శించారు. మెడికల్ కాలేజీ, తట్టిపల్లి మండలం వంటి విషయాలను కూడ ప్రస్తావన లేకుండ సభను ముగించారని మండిపడ్డారు. తాండూరు ప్రాంత సమస్యలపై, ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం సాధించినట్లు అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో సీఎం పర్యటనతో తాండూరుకు ఒరిగిందేమి లేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో మంత్రులకు, ఎమ్మతులకు, ఎమ్మెల్సీలకు, పీపీ, జెడ్పీటీసీలకు, ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వైఖరితో నలిగిపోతున్న టీఆర్ఎస్ కిందిస్థాయి నేతలు తాండూరు ప్రాంత అభివృద్ధి కో సం బీజేపీలో చేరాలని సూచించారు. ఇచ్చిన హామిలను నెరవేరుస్తూ.. సబ్బండ వర్గాల అభ్యున్నతికి బీజేపీ నిరంతరం పనిచేస్తూ మోడీ ప్రభుత్వం జనరంజక పాలన చె చేస్తుందన్నారు. దీంతో బీజేపీ అంటేనే కేసీఆర్కు భయం పట్టుకుందని, కండువాలు చేసుకోని కార్యకర్తల్లా పోలీసులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఎన్ని విధాలుగా భయబ్రాంతులకు గురిచేసినా బీజేపీ భయపడేది లేదన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న మోపాలను ఎండగట్టి ప్రజల్లో దోషులుగా నిలబెడతామన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం సీఎం పర్యటనను అడ్డుకుని గాయాల పా లైన పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, బీజేవైఎం నాయకులు అంతారం కిరణ్. రమేష్ సాగర్, విక్రమ్ రెడ్డి, అభిలాష్ పండిత్, ఓబీసీ మోర్చ నాయకులు మహేష్, హరి ష్, మైనార్టీ మోర నాయకులు అబ్బాస్, అనిల్ రెడ్డి, సాయికుమార్, యాదయ్య తదితరులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, సీనియర్ నాయకులు పూజారి పాండు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


