తాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrతాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి
– భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన స్వామి
– ఆశీర్వచనాలు తీసుకున్న భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరులో శ్రీ మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సాయిబాబా ట్రాన్స్ పోర్ట్ అలంపల్లి కిరణ్ నివాసంతో పాటు రసూల్ పూర్ ఎదురుగా పటేల్ అడ్డాలోని కమ్మరి కృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ భక్తులకు మల్లికార్జున స్వామి అప్పాజీ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వారి నివాసాలకు వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామి అప్పాజీ పాద సేవ చేసుకున్నారు. అనంతరం స్వామి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి అప్పాజీ చారిట్రబుల్ ట్రస్టు చైర్మన్ దరిమీది రవిశంకర్, ప్రధాన కార్యదర్శి పూజారీ పాండు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆత్మ విశ్వాసంతో సిద్దం కండి..!