తెలంగాణ విముక్తికి బండి యాత్ర భరోసా
– ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న పటేల్ రవిశంకర్
– బండి సంజయ్‌ను సన్మానించిన తాండూరు ఇంచార్జ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేసీఆర కుటుంబ పాలనలో బంధి అయిన తెలంగాణకు భరోసా కల్పించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ భరోసా కల్పిస్తున్నారని బీజేపీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పటేల్ రవిశంకర్ అన్నారు. ఈనెల యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఆదివారం కొనసాగిన ఈ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ను తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పటేల్ రవిశంకర్ కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను పటేల్ రవిశంకర్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎనిదేళ్లుగా తెలంగాణ కేసీఆర్ కుటుంబ పాలనలో, బానిసత్వంలో నలిగిపోతుందన్నారు. తెలంగాణకు విముక్తి కల్పించేందుకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అన్నారు. ఈ యాత్రలో తెలంగాణ సమాజానికి భరోసా అందుతుందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


