కాంగ్రెస్‌ పార్టీతోనే దేశానికి స్వాత్రంత్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ పార్టీతోనే దేశానికి స్వాత్రంత్యం
– తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే
– గాంధీ కుటుంబం నుంచే దేశ సేవ చేయాలి
– 12 ఏండ్లు బీజేపీ పేదలకు చేసిందేమి లేదు
– గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి
– వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటా
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు పట్టణం శ్రీ కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్‌(ఆర్‌జీపీఆర్‌ఎస్‌)పై సర్పంచులకు అవగాహనతో పాటు శిక్షణ కార్యక్రమం నిక్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

దేశానికి గాంధీ కుటుంబం ఎంతో సేవ చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు మేలు చేస్తే.. 12ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం పేదలకు చేసిందేమి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో పెద్దలకు మాత్రమే మేలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో ఈ రెండున్నర సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయానల్నారు. పదవిని ఒక బాధ్యతగా భావించి.. నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలన్నారు.

గ్రామాల అభివృద్ధి పూర్తి సహాకారం తమ వంతుగా అందిస్తానని, ఇందుకోసం తాండూరు క్యాంపు కార్యాలయంలో వారానికి 4 రోజులు అందుబాటులో ఉంటానని భరోసా అందించారు. అనంతరం సర్పంచ్ లకు, నాయకులకు సర్టిఫికెట్ లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్‌ ఇంచార్జి సుభాష్, శిక్షకులు రాము, సతీష్, జాఫర్, కరుణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మహిపాల్, రాజ్ కుమార్, రాజవర్ధన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఢీకొట్టింది బైక్.. దెబ్బతిన్నది భవిష్యత్తు..!