మల్ రెడ్డిపల్లి రోడ్డుకు మోక్షం
– ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గత కొన్నేళ్లుగా అద్వాన్న రహదారితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, స్థానికులకు కష్టాలు తొలగిపోయాయి. పట్టణంలోని శివాజీ చౌరస్తా నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే రోడ్డు పనులు ఆదివారం శరవేగంగా కొనసాగాయి. గతంలో ఈ మార్గంలో గతకుల రోడ్డుతో స్థానికులతో పాటు ఈమార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడేవారు. చిన్న వర్షానికే మార్గం పూర్తిగా చెరువుగా మారేది. సమస్యను పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రోడ్డు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయించారు. దీంతో రోడ్డుకు రాజయోగం మొదలైంది. ఆదివారం రోడ్డు పనులు వేగంగా కొనసాగాయి. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకలు అబ్దుల్ సలీం, స్థానికులు రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనులు చేపట్టడంపై స్థానికులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


