లైసెన్స్లు లేకుండా వ్యాపారాలు..!
– కొరడా జులిపించిన మున్సిపల్ అధికారులు
– వ్యాపారులకు రూ.30 వేల జరిమానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. పలువురు వ్యాపారులపై పెద్ద ఎత్తున జరిమానాలు విధించారు. గత కొన్నేండ్ల నుంచి తాండూరు పట్టణంలో పలువురు ఎలాంటి లైసెన్స్లు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తాండూ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి ఆదేశాల మేరకు శానిటరీ ఇనుస్పెక్టర్ కిష్టయ్య, వెంకటయ్యల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఈ తనిఖీలు చేశారు. పలు ప్రాంతాల్లోని హోటళ్లలో అనుమతి పత్రాలను ఆరా తీశారు.
ఈ క్రమంలో పట్టణంలోని మెట్రో మనీలా రెస్టారంట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తు గుర్తించారు. దీంతో హోటల్ యజమాని అర్జున్ రెడ్డి పేరుపై రూ.25వేల నగదు జరిమాన విధించారు. అదేవిధంగా మరో మూడు హోటళ్లలో కూడా తనిఖీ హోటళ్లతో పాటు జ్యూస్ సెంటర్లపై దాడులు నిర్వహించి పలువురికి రూ. 5వేల జరిమాన విధించారు. మొత్తం రూ.30వేల వరకు వ్యాపారులకు జరిమాు ధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ లైసెన్స్ లు లేకుండా వ్యాపారులు వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ ఆ జనవార్లు హరికృష్ణ, శ్రీనివాస్, వీరన్న, అశోక్, బాలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

