యువత సేవాదృక్పథం అభినందనీయం
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– కానిస్టేబుల్ ప్రిలిమినరీ అభ్యర్థులకు పండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: యువత సేవా దృక్పథ కార్యక్రమాలు చేపట్టడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా తాండూరు పట్టణంలోని సాయిపూర్ లోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు సాయిపూర్ యువత పండ్లు, వాటర్ బాటిల్స్ వితరరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరై అభ్యర్థులకు పండ్లు, వాటర్ బాటిల్‌లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయిపూర్ ప్రాంత యువతకు ఇలాంటి మంచి సేవ దృక్పథంతో వారి సొంత డబ్బుల నిమిత్తం పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులకు పండ్లు,వాటర్ బాటిల్స్ ను పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు కానిస్టేబుల్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలన్నారు. ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలని, ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మీ తల్లిదండ్రుల ఆశయాలను నిరవేర్చాలని ఆకాంక్షించారు.


