విద్యుద్ఘాతంతో ఆవు మృత్యువాత
– తాండూరు మండలం ఎల్మకన్నెలో ఘటన
– అధికారుల నిర్లక్ష్యమే అంటూ గ్రామస్తుల ఆరోపణ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: విద్యుద్ఘాతంతో ఓ ఆవు మృత్యువాత పడిన సంఘటన తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు నానాపురం వెంకటప్పకు చెందిన ఆవు పొలానికి వెళ్లే దారిలో విద్యుత్ స్థంబం వద్ద ఉన్న లూప్ లైన్ వల్ల షాక్ కు గురైంది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్యం వల్లే మూగజీవి మృత్యువాత పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్థంబం వద్ద ఉన్న లూప్ లైన్ ను సరిచేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందడం వల్ల నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం అందించాలని బాధితులు కోరారు.


