సంబ‌రంగా ఎంపీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

తాండూరు రాజకీయం వికారాబాద్

సంబ‌రంగా ఎంపీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు
– ఎంసీహెచ్‌లో పండ్లు, అల్ప‌హారం పంపిణీ 
– పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్, నేత‌లు 
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి:  చేవేళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు గ‌డ్డం రంజిత్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు ఆదివారం తాండూరులో సంబ‌రంగా జ‌రుపుకున్నారు. రంజిత్ రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుప‌త్రిలో రోగుల‌కు పండ్లు, బంధువుల‌కు అల్ప‌హారం పంపిణీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ హాజ‌రై నేత‌లు, కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి పండ్లు, అల్ప‌హారం పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మాన‌వ‌తా వాధి అని అన్నారు. ఎంతో మంది వికలాంగుల‌కు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అంద‌జేసి సంతోష పెట్టార‌ని గుర్తుచేశారు. అదేవిధంగా అభివృద్ధిలో త‌న‌వంతు పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. ఆయ‌న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి, వెంకన్న గౌడ్, బోయ రవి రాజు, టీఆర్ఎస్ నాయకులు మసూద్,  మన్మోహన్ సార్ఢ, బంటు మల్లప్ప, వాజిద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.