పూల పండ‌గ‌కు వైభ‌వం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పూల పండ‌గ‌కు వైభ‌వం..!
– బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో బ‌తుక‌మ్మ సంబ‌రాలు
– పాల్గొన్న‌ బీసీ సంఘం జాతీయ‌ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ సంస్కృతిని ప్ర‌తీక‌గా నిలిచిన బ‌తుక‌మ్మ పండ‌గ‌కు తాండూరు నియోజకవర్గ బీసీ మహిళా సంఘం వైభ‌వం తీసుక‌వ‌చ్చింది. శుక్ర‌వారం బీసీ సంఘం తాండూరు అధ్య‌క్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప‌ట్ట‌ణంలోని నెహ్రు గంజ్ ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన ఉత్స‌వాల‌కు బీసీ సంఘం జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌య్య‌ద్ షుకూర్, వికారాబాద్ జిల్లా అధ్య‌క్షురాలు మ‌ధుల‌తా శ్రీ‌నివాస్ చారీ, పొట్లీ మ‌హారాజ్ దేవాల‌య చైర్మ‌న్ రాజ‌న్ గౌడ్‌లు హాజ‌రై సంబ‌రాల‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలని ఆచారాలని కొనసాగిస్తూ బీసీ మహిళా సంఘం ద్వారా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ అంటే బతకడానికి ధైర్యాన్నిచ్చే అమ్మ అని ఆ ధైర్యాన్ని బీసీ మహిళలు అంతా కూడగట్టుకొని బీసీ అభివృద్ధి సాధన కోసం ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బీసీ మహిళ ఉపాధ్యక్షులు కే అనితరాజ్, కార్యదర్శి గూటికే విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజుల, సెక్రటరీలు మంబాపూర్ విజయలక్ష్మి, విజయ, నరసమ్మ, బీసీ మండలాల అధ్యక్షులు లక్ష్మణా చారి, నరేందర్, బసంత్ కుమార్, బీసీ నాయకులు వెంకట్, బస్సు, రాము తదితరులు పాల్గొన్నారు.