ఉల్లి ఉప‌యోగ‌మే..!

ఆరోగ్యం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఉల్లి ఉప‌యోగ‌మే..!
– మ‌ధుమేహానికి చెక్
– ప‌రిశోధ‌న‌లో కొత్త విష‌యాలు
ద‌ర్శిని డెస్క్: ఉల్లి చేసే మేలు త‌ల్లి చేయ‌ద‌ని నానుడి ఉంది. అంటే ఉల్లిపాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని అర్థం. ఉల్లిపాయ‌ల‌పై జ‌రిపిన తాజా ప‌రిధోధ‌న‌లో గ‌తంలో తెలిసిన విష‌యాల‌క‌న్నా కొత్త అంశాలు తెలిశాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాన ఆరోగ్య స‌మ‌స్య మ‌ధుమేహం. ఈ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు సంభవిస్తుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల, మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి మన రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి, అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గంగా పేర్కొంటున్నారు.

ఉల్లిలో మ‌ధుమేహ నియంత్ర‌ణ శ‌క్తి
మన వంటగదిలో సాధారణంగా అందుబాటులో ఉండే ఆహార పదార్ధాలలో ఉల్లిపాయ మంచి పోష‌కాల‌ను అందిస్తుంది. శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ 97వ వార్షిక సమావేశంలో ఉల్లిపాయ‌ల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌నలో కీలక విషయాలు వెలుగులోకి తీసుక‌వ‌చ్చింది. రక్తంలో చక్కెర స్థాయిలను 50 శాతం తగ్గించడంలో ఉల్లి పాయ‌లో అత్యుత్త‌మ ల‌క్ష‌ణాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. దీని ద్వారా మ‌ధుమేహాన్ని చ‌క్క‌గా నియంత్రించ‌వ‌చ్చ‌ని వివ‌రించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం “ఉల్లిపాయ బల్బ్, అల్లియం సెపా, యాంటీడయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో ఇచ్చినప్పుడు డయాబెటిక్ ఎలుకలలో.. రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర), మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గించింద‌ని తెలిపారు. మ‌రోవైపు ఉల్లిపాయ‌లు కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఇది గొప్పదని కూడా నిరూపితమైంది.

ఉల్లి రక్తంలో గ్లూకోజ్ తగ్గింపుకు దారితీసిన పరిస్థితులు, అధ్యయనాన్ని తాము పరిశోధించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలని తాము సూచిస్తున్నామన్నారు. అయితే, ఏదైనా జీవనశైలి మార్పునకు అనుగుణంగా ఉండే ముందు ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించాలని పేర్కొన్నారు.