న‌మో.. క‌న్యామాత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

న‌మో.. క‌న్యామాత..!
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్ నివాసంలో న‌వ‌రాత్రి శోభ
– 9 మంది కన్యలకు పూజ, భోజనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: న‌మో క‌న్యామాత అంటూ తాండూరు మున్సిప‌ల్ 20వ వార్డు కౌన్సిల‌ర్ దుర్గామాత‌ల‌కు ప్ర‌తిరూప‌మైన క‌న్యా దేవత‌ల‌ను వేడుకున్నారు. నవరాత్రి ఉత్సవాలలో అష్టమి పర్వదినాన 9 మంది కన్య(రెండు ఏండ్ల నుంచి 10 లోపు బాలికలు)లకు పూజలు నిర్వహించి.. భోజనం, బహుమతులు అందజేయడం వారి సంప్రదాయం. ఈ ఆనయవాతిలో భాగంగా సోమవారం కౌన్సిలర్ సంగీత ఠాకూర్ 9 మంది కన్యలకు తన నివాసంలో పూజలు నిర్వహించారు. అనంతరం భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో అష్టవి, నవమి రోజులలో దుర్గామాత కన్యా రూపాలలో అవాహనం చెందుతారని విశ్వసిస్తామన్నారు. దుర్గామాత ఆశీస్సులు అందరికి ఉండాలని, పండగను అందరు సంతో షంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.