ఎమ్మెల్యేగా మళ్లీ రోహిత్ రెడ్డిదే గెలుపు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేగా మళ్లీ రోహిత్ రెడ్డిదే గెలుపు
– ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాం
– టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యేగా మళ్లీ పైలెట్ రోహిత్ రెడ్డినే గెలవాలని ప్రజలు, యువత ఆశిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ అన్నారు. శనివారం ప్రగతి భవన్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ తాండూరు పట్టణ ప్రధానకార్యదర్శి, సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం సంతోష్‌ గౌడ్ మాట్లాడుతూ అవకాశం వస్తే ఎప్పుడు కోట్లు సంపాదిద్దామని అలోచించే ఈరోజుల్లో ఢిల్లీ దొరలు కోట్లకు కోట్లు ఆశ చూపించిన తృణప్రాయంగా తిరస్కరించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని వెన్నంటే నడిచేందుకు యువత సిద్దంగా ఉన్నారని అన్నారు. తాండూరు ఎమ్మెల్యేగా మళ్లీ పైలెట్ రోహిత్ రెడ్డిని గెలవాలని తాండూరు ప్రజలు, యువత ఆశిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, మహేశ్వర్ రెడ్డి, యోగానంద్, నిరంజన్, మల్లికార్జున్, సతీందర్ పటేల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.