నేత్రదానంతో అందుల జీవీతాల్లో వెలుగులు
– జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ స్పందనరెడ్డి
– జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేత్రదానంతోనే అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని కంటి వైద్య నిఫుణులు, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ స్పందన రెడ్డి అన్నారు. గురువారం పీపీ యూనిట్‌లో 36వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేత్రదానం యొక్క ప్రాధాన్యత, తద్వారా కలిగే ప్రయోజనాలను విరించారు. మరణించిన వ్యక్తి నుంచి 4గంటల్లోపు నేత్రాలను తీసుకుని కంటిచూపు లేనివారికి అమర్చవచ్చన్నారు. ఒక యేడాది వయస్సు ఉన్న వారితో పాటు 100 ఏండ్లు ఉన్న వృద్దులు, మహిళలు, పురుషులు.. బీపీ, షుగర్, ఆస్తమా ఉన్నవారితో పాటు గతంలో ఆపరేషన్ చేయించుకున్న వారు నేత్రదానం చేయవచ్చన్నారను. హెచ్ఐవీ, హైపటైటీస్, ధనుర్వాతం, కరోనా, మలేరియాతో మరణించిన వారి కళ్లు పనికిరావన్నారు. ఒకరి నేత్రదానంతో ఇద్దరు అంధులకు దృష్టిదానం చేయవచ్చాన్నారు. కావున ప్రజలు నేత్రదానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ రామిరెడ్డి, సూపర్ వైజర్లు వెంకటేష్, శ్యామల, స్టాఫ్ నర్సు జ్యోతి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
