రెండు నెలల్లో.. రెండు గదుల ఇళ్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రెండు నెలల్లో.. రెండు గదుల ఇళ్లు..!
– అర్హులైన పేదల కోసం పంపిణీ
– పనులు పూర్తి చేసేందుకు కసరత్తు
– రోడ్లు, మౌళిక వసతుల కల్పనపై దృష్టి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేసి పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పంపిణి చేసేందుకు దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌లు తెలిపారు.

శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్‌లు పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యాయి. ఏయే దశలో నిర్మాణంలో ఉన్నాయి అని పరిశీలించారు. రోడ్లు, మౌళిక వసతుల కల్పనపై సమీక్షించారు. నిర్మించిన.. నిర్మాణంలో ఉన్న ఇళ్లు పక్కాగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌లు మాట్లాడుతూ వచ్చే 60, 70 రోజులలో డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి హౌజింగ్‌ శాఖకు బదలాయించడం జరిగిందని తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయడంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి చేసిన తరువాతా అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అదేవిధంగా నిరుపేదలై ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన వారికీ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్,తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, జుబేర్ లాల, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ నెంబర్‌ను మరవొద్దు..!