తుల్జాపూర్ భక్తుల సేవలో పైలెట్
– పాదయాత్రికులకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన షోలాపూర్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాదయాత్రగా తుల్జాపూర్ బయల్దేరిన భక్తుల సేవలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరించారు. శనివారం తాండూరు రేణుకా నాగ ఎల్లమ్మ, భవాని మాత సేవా సమితిల ఆధ్వర్యంలో షోలాపూర్ నుంచి తుల్జాపూర్ పాదయాత్రగా వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తుల్జాపూర్ తామల్వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రగా బయల్దేరిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తుల్జాపూర్ భవాని మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలన్నారు. అమ్మవారి ఆశీస్సులలో తాండూరు సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలు సంమృద్ధిగా పండాలని, విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవెనలతో తాండూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు షోలాపూర్‌కు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని నాయకులు శంకర్ భండ్గర్ తదితరులు స్వాగతం పలికి సన్మానించారు.

ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సినీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, భద్రశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి, ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

