బీఎస్ఆర్ ఇంటికి చీఫ్ విప్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఎస్ఆర్ ఇంటికి చీఫ్ విప్..!
– సుదీర్ఘంగా రాజకీయ మంతనాలు..
– బుయ్యనితో మహేందర్‌రెడ్డి భేటీ
– తాండూరులో హాట్‌టాపిక్‌గా మారిన సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి.. తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మహేందర్‌రెడ్డి, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి మధ్య సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. సాధారణ మర్యాదపూర్వక భేటీనా.. లేక రాజకీయ అంశాలపై కీలక చర్చ జరిగిందా? అనే చర్చ తాండూరులో జోరుగా సాగుతోంది. అయితే సమావేశంలో చర్చించిన అంశాలు మాత్రం బయటకు రాలేదు.

చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఎక్కువ సమయం గడపడంతో స్థానిక రాజకీయ నాయకుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా సాగిన చర్చలపై పార్టీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. రాబోయే రోజుల్లో తాండూరు రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలకు ఈ భేటీ ఏమైనా సంకేతమా? అన్న చర్చ కూడా వినిపిస్తోంది.

నేతలతో కలిసి సందడి
భేటీ అనంతరం మహేందర్‌రెడ్డి, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి పలువురు నాయకులతో కలిసి సందడి చేశారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్, భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌కుమార్, బిడ్కర్ రఘు, రోంపల్లి సంతోష్‌కుమార్, తాండ్ర రాకేష్, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేతలంతా కలిసి ఉన్న ఫొటోలు, భేటీకి సంబంధించిన పరిణామాలు తాండూరు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీశాయి.

కోకట్ టీచర్ జపాన్ బాట..!