ఏఎంసీ చైర్మన్కు ఘన సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన బేడ బుడిగ జంగం సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఖాసిం అలీలను బేడ బుడిగ జంగం సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

మంగళవారం మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్లను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లు రైతులు, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు భారతకవి అజంత, ఉపాధ్యక్షుడు భారతకవి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సంకు మొగులప్ప, గౌరవ అధ్యక్షుడు కడమంచి ఆశప్ప, కోశాధికారి సిరిగిరి మొగులప్ప, ఉపాధ్యక్షుడు కడమంచి కేశవులు, సలహాదారులు భారతకవి నరేష్, సిరిగిరి శేఖర్, సభ్యులు భారతకవి గణేష్, రుద్రాక్షల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


