కారు కూతలపై కేసు..!
– బీఆర్ఎస్ యువ నాయకుడుపై చర్య
– కాంగ్రెస్ యువ నేత పిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు కూసిన కారు కూతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన పిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చాలా గ్యాప్ తరువాత తాండూరుకు వచ్చారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకులు అనిల్ బాండ్ బహిరంగంగా అసబ్యకరంగా వాఖ్యలు చేశారు.

అయితే కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు అనిల్ బాండ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ యువనేత సందీప్ రెడ్డి తాండూరు పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనిల్ బాండ్ రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేయడం సరికాదని, అనిల్ బాండ్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


