శభాష్.. ఆర్టీసీ ఉద్యోగులు
– నిజాయితిని చాటుకున్న కండక్టర్, డ్రైవర్
– రూ. 10వేల ప్రయాణికుల సొమ్ము అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ ఉద్యోగులు శభాష్ అనిపిపించుకున్నారు. బస్సులో ప్రయాణిస్తూ సొమ్మును మరిచిన ప్రయాణికులకు తిరిగి అందించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం వికారాబాద్ నుండి తాండూరు వెళ్లే బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న బాగును మరిచి పోయి దిగారు. గమనించిన అదే బస్సు కండక్టర్ లక్ష్మణ్, డ్రైవర్ శ్రీనివాస్‌లు బ్యాగును తీసుకున్నారు. ఈ విషయాన్ని తాండూరు డిపో మేనేజర్ ఉపేందర్‌తో పాటు సీఐ జనార్దన్‌ల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాగును మరిచిపోయిన ప్రయాణికులను గుర్తించి బ్యాగులో ఉన్న రూ.10000లను అందజేశారు. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు చాటుకున్న నిజాయితీపై పలువురు ప్రశంసలు కురిపించారు. శభాష్ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది అంటూ అభినందించారు.

