చినుకు దారికి చికిత్స..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చినుకు దారికి చికిత్స..!
– హైదరాబాద్ రోడ్డుకు మరమ్మత్తులు
– దగ్గరుండి చేయిస్తున్న గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారీ వర్షం పడిదంటే చాలు ఆ మార్గంలో వరద పొటెత్తుతుంది. వర్షపునీరు నిండి రోడ్డు స్థంభించిపోతుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయి. అదే తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గం. చినుకు పడితే వచ్చే కష్టాలకు తాండూరు టీఆర్ఎస్(బీఆర్ఎస్) నేతలు చికిత్స చేయిస్తున్నారు. బషీర్మీయా తాండా, జెడ్ అండ్ బి ఫ్యాక్టరీ సమీప ప్రాంతాలలో మరమ్మత్తుల పనులు చేపట్టారు.

శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ దగ్గరుండి రోడ్డు మరమ్మత్తులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ వర్షం వల్ల రాజీవ్ కాలనీ రోడ్డు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు” పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో రోడ్డుకు ప్రాథమిక మరమ్మత్తులు చేయిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి మళ్లీ వర్షం కురిసినా నీరు నిలువకుండా ఉండేలా మట్టి వేయించి లెవల్ పెంచడం జరుగుతుందన్నారు. దీంతో పాటు నాలా నుంచి వరద నీరు సక్రమంగా పారేలా కల్వర్టుకు త్వరలోనే మరమ్మత్తులు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే రోడ్డు సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు నర్సిరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.