గ్రూప్-1 పరీక్ష ప్రశాంతం
– జిల్లాలో 833 మంది గైర్హాజరు
– పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
– పటిష్ట బందోబస్తు : జిల్లా ఎస్పీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆదివారం గ్రూప్-1 పరీక్షను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాలలో మొత్తం 4857 మందికి అలార్ట్ చేయగా 4024 మంది హాజరై పరీక్షలు రాశారు. మిగతా 833మంది గైర్హాజరు అయ్యారు. ఆదివారం జిల్లాలోని సిద్దార్థ జూనియర్ కళాశాల, బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఆయా కేంద్రాలలో పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 82.8 శాతం హాజరు నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు గ్రూప్-1 పరీక్ష సందర్భంగా జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఇట్టి బందోబస్త్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందికి అందరికి అభినందనలు తెలిపారు.

