క్రీడాకారుల అభ్యున్నతిని తోడ్పాటు

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

క్రీడాకారుల అభ్యున్నతిని తోడ్పాటు
– ఖేలో ఇండియాతో తాండూరుకు క్రీడా మైదానం
– కల్పన అంతర్జాతీయంగా రాణించాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రీడాకారులు అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. తాండూరుకు చెందిన క్రీడాకారిణి కల్పన అండర్ 19 విభాగంలో టీ-20 రాష్ట్ర జట్టుకు స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికైన సందర్భంగా సోమవారం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ వారి నివాసానికి వెళ్లారు. ఈ నెలలో చెన్నైలో జరిగే జాతీయ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్న సందర్భంగా రాజుగౌడ్ కల్పనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరులో క్రీడలకు అనువైన, అవసరమైన క్రీడా మైదానాలు లేకపోవడంతో స్థానిక క్రీడాకారులు వెనుకబాటుకు గురయ్యారని అన్నారు. ఖేలో ఇండియా ద్వారా రాష్ట్రంలో రెండు మైదానాలు ఏర్పాటు కాబోతున్నాయని, ఇందులో ఒకటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో స్థానికంగా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు మరింత ప్రోత్సహాం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జాతీయ టోర్నమెంట్ టీ-20లో పాల్గొంటున్న క్రీడాకారాణి కల్పనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరి హరగౌడ్, యువ నాయకులు ఈర్షాద్, కల్పన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.